మహిళలకు రంగవల్లుల పోటీలు

హైదరాబాద్ (CLiC2NEWS): ముగ్గుల పోటీల్లో మహిళలందరూ పాల్గొని ఆరోగ్యం గా ఉండాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, డా. క్యార్లిన్, డా.పి.స్వరూప రాణి పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ పోటీలు డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు.
2 సంవత్సరాల నుంచి కరోనా తో ఇంట్లోనే ఉంటూ ఆనందం అనే మాటే మరిచిపోయి జబ్బు లతో సావాసం పెరిగిపోయిందన్నారు. రంగవల్లులతో మానసిక,శారీరక ఆరోగ్యం బాగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మానవ సంబంధాలు బలపడుతూ, ఉద్వేగాలు చల్ల బడతాయని తెలిపారు. ఇవి తమపర భేదాలు, వయస్సు తో సంబంధం లేకుండా అందరినీ ఒక్క చోట చేర్చి ఒత్తిడి నీ జయించేలా చేస్తాయన్నారు. వీటితో ఏకాగ్రత, సహనం, సృజనాత్మక పెరిగుతాయన్నారు. మానవ జీవితంలో సంస్కృతి, సంప్రదాయాలు జీవన సౌధానికి పునాది వంటివన్నారు. అందుకే మహిళలందరూ డిసెంబర్ 30 లోపు జరిగే రంగవల్లి పోటీలో పాల్గొనాలని కోరారు. మహిళల్లో ఏదో ఒక నైపుణ్యం వున్న వారు ఉంటే వారి పేర్లు మాకు పంపితే చిరు సత్కారం, సర్టిఫికెట్, బహుమతులను జనవరి 2022, 8వ తేదీన కేంద్ర మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు.