టిటిడికి పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్ధం: విజయ డెయిరీ

హైదరాబాద్ (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానంకు అధిక నాణ్‌యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ తెలపింది. ఈ మేరకు టిటిడి ఇఒ జె. శ్యామలరావుకు లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియేగించే నెయ్యి కల్తీ జరిగినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ డెయిరీ తమ పాల ఉత్పత్తులను టిటిడికి అందించేందుకు సన్నద్ధతను తెలియజేస్తుంది. విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాలో స్వచ్చత, నాణ్‌యత , ధరల విషయలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని .. దేవస్థానం , భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.