బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జిఓ విడుదల..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బద్వేల్‌ను రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ జిఓ విడుదల చేశారు. సిఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా కేటాయిస్తూ మంగళవారం జిఓ విడుదల చేశారు. ఈసందర్భంగా బద్వేల్ నియేజక వర్గ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంవత్సరం జూలై నెలలో బద్వేలు పర్యటనలో సిఎం బద్వేల్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే.