ఎపిపిఎస్‌సి ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపిఎస్ అధికారి అనురాధ

అమరావతి (CLiC2NEWS): ఎపిపిఎస్‌సి ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపిఎస్ అధికారి ఎఆర్ అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్ సవాంగ్ ఈ ఏడాది జులై 4న పదవికి రాజీనామా చేయగా.. అప్పటినుండి ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. టిడిపి హయాంలో ఎపి ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపిఎస్ అధికారిణిగా అనురాధ గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఎస్‌పిగా, ఐజిగా అనురాధ పనిచేశారు. ఛైర్‌పర్సన్ నియామకంతో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.