మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
న్యూఢిల్లీ (CLiC2NEWS): గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 25 వాణిజ్య సిలిండర్‌పై రూ. 75 పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచే అములోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది.
చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలెండర్‌పై రూ. 50 పెరగడం గమనార్హం. తాజా పెరుగుదలతో ఢిల్లీలో రాయితీ వంటగ్యాస్ ధర రూ.884.50కి చేరుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కెజీల సిలిండర్ ధర రూ. 1,693కు చేరింది.
ఈ ఏడాదిలో మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది.