ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

నాగర్‌కర్నూల్ (CLiC2NEWS): హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఈరోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన రెండుకార్లు నుజ్జునుజ్జయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.