రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు మృతి..

సంగారెడ్డి (CLiC2NEWS): పటాన్ చెరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్లేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఆశిష్ ముజేందర్, శివనాథ్, గుల్‌దేవ్ బహదూర్ ఒకే వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న శివ, అజిత్ బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆశిష్ ముంజేదర్, శివ, అజిత్ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.