మోదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు అన్నదమ్ములు మృతి

మెదక్ (CLiC2NEWS): జిల్లాలోని చేగుంట సమీపంలో బైక్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీదవెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. రాకేశ్ (17) ప్రదీప్(15), అరవింద్ (14) అన్నదమ్ములు. రాకేశ్ తన ఇద్దరు తమ్ముళ్లను పాఠశాలకు తీసుకువెళ్తుండగా బైక్ అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ఇద్దరుకూడా మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.