RRR:​ ఎన్టీఆర్​ నయా లుక్‌..

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా తారక్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్​ఆర్​ఆర్’​లోని ఎన్టీఆర్​ కొత్త లుక్​ విడుదలైపోయింది. కొమురం భీమ్​ అవతార్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. ఇందులో బల్లెం చేతిలో పట్టుకుని సీరియస్​ లుక్​లో కనిపించారు తారక్​. ఇది అభిమానులను కట్టిపడేసేలా ఉంది. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ రౌద్రంగా కన్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

“మా భీమ్‌ది బంగారులాంటి మనస్సు. కానీ, ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలం, ధైర్యంగా నిలుస్తాడు’
-రాజమౌళి ట్వీట్‌.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. వీరితో పాటు అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరన్ తదితరులు నటిస్తున్నారు.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 న థియేటర్లలో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది

Leave A Reply

Your email address will not be published.