‘ఆర్ఆర్ఆర్’ సర్‌ఫ్రైజ్.. ‘ఎత్తర జెండా’ సాంగ్ రిలీజ్
హైదరాబాద్ (CLiC2NEWS): ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ‘ఎత్తర జెండా’ పాట విడుదలైంది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నరామ్ చరణ్, తారక్ నటించిన చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ ఈనెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ చిత్రం నుండి ఓ స్పెషల్ సర్ ప్రైజ్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ‘ఎత్తర జెండా’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.