ప్రైవేట్ బస్సుల్లో రూ.5.60 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం..

తూర్పుగోదావరి (CLiC2NEWS): జిల్లాలోని కిర్లంపూడి మండలం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణవరం గ్రామం జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం తనిఖీలు చేయగా.. ఒక బస్సులో 10 కేజీల 100గ్రాముల బంగారం, మరో బస్సులో రూ. 5.60 కోట్ల నగదును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు వీటికి ఎటువంటి బిల్లులు, జిఎస్టి చెల్లింపులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ బస్సులు విజయవాడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్నాయి. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు బస్సులను తనిఖీ చేసి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.