2009లో ఆర్టిసిబస్సు ఢీకొని మృతి చెందిన మహిళ.. రూ.9కోట్ల పరిహారం
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/Supreme-Court.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): 2009లో ఎపిలో ఆర్టిసి బస్సు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
2009 జూన్ 13వ తేదీన లక్ష్మి నాగళ్ల అనే మహిళ.. తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుండి రాజమహేంద్రవరానికి వెళుతున్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సు ఆకారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణమైన అర్టిసి ఉండి రూ.9 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.
అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన లక్ష్మి నాగళ్ల.. అక్కడే శాశ్వత నివాసిగా ఉన్నారు. నెలకు 11,600 డాలర్లు సాంపాదిస్తున్నారు. ఆమె మృతి చెందటంతో నష్టపరిహారంలో రూ.9 కోట్లు చెల్లించాలని ఆమె భర్త కేసు వేశారు. వాదనలు విన్న సికింద్రాబాద్ మోటార్ యాక్సిటెండ్స్ ట్రైబ్యునల్ రూ. 8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టిసి 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఎపిఎస్ అర్టిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు పరిహారంగా రూ.5.85 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనిపై మృతిరాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు ఎపిఎస్ ఆర్టిసిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.