ఎపిలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా డీజిల్ సెస్ రూపంలో బస్సుఛార్జీలు పెంచతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎపిఎస్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తోందని పేర్కొన్నారు. డీజిల్ రేటు సుమారు 60% పెరిగిందని, రెండేళ్లుగా రూ. 5,680కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చిందని అన్నారు.
ఆర్డినరీ బస్సులకు రూ.2 చొప్పన, ఎక్స్ప్రెస్ సర్వీసులకు రూ. 5 చొప్పున, ఎసి బస్సులకు రూ. 10 చొప్పున డీజిల్ సెస్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.