నేడు విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/kanaka-mahalakshmi-mata.jpg)
విశాఖపట్నం (CLiC2NEWS): కనకమహాలక్ష్మి అమ్మవారికి గురువారం సాయంత్రం 4 గంటల నుండి సహస్ర ఘటాభిషేకం నిర్వహించడానికి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గశిర మాసోత్సవాలలో భాగంగా అయిదో గురువారం అమ్మవారికి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 1008 కలశాలలతో పసుపు, కుంకుమ కలిపిన జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7గంటల వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. పూజలు ముగిసిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. అంతే కాకుండా జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో 20వేల మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.