`సైదాబాద్‌` బాలిక హ‌త్య ఘటన నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన బాలిక‌పై ఆఘాయిత్యం, హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో అరెస్ట్‌ చేశారు. బాలిక హత్య అనంతరం నిందితుడు పరారైన విసయం తెలిసిందే. అయితే రాజు స్వగ్రామానికి వచ్చాడని గుర్తించిన పోలీసులు.. శుక్రవారం అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్ తరలించిన‌ట్లు ఎస్సై ఉద‌య‌కిర‌ణ్ వెల్ల‌డించారు.

గురువారం సాయంత్రం సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలిక అదృశ్యమైంది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు కాలనీలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలి ఇంటి పక్కనే ఉండే రాజు ఇంట్లో ఆ బాలిక మృతదేహం లభించింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశాడని ఆమె కుటింబీకులు ఆరోపించారు. అత‌డి కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలించారు. తూర్పు మండ‌లం డిసిపి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో ప‌ది ప్రత్యేక బృఃదాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ‌సభ్యులు, స్థానికులు చంపాపేట నుంచి సాగ‌ర్ వెళ్లే రోడ్డులో దాదాపు 7 గంట‌ల పాటు భైఠాయించారు. క‌లెక్ట‌ర్ హామీతో ఆందోళ‌న విర‌మించారు.
ప్ర‌భుత్వం త‌ర‌ఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, రెండు ప‌డ‌క‌ల ఇల్లు, పొరుగుసేవ‌ల విభాగంలో ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చారు. త‌క్ష‌ణ సాయం కింద రూ. 50 వేలు అంద‌జేశారు.

కాగా చిన్నారి మృత‌దేహానికి ఉస్మానియాలో పోస్టు మార్టం పూర్తిచేశారు వైద్యులు. అత్యాచారం చేసి గొంతు నులిమి చిన్నారిని హ‌త్య చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌యింది. పోస్టు మార్టం అనంత‌రం బాలిక మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

Leave A Reply

Your email address will not be published.