రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): `మెగా` నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కేబుల్‌బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సాయిధరమ్‌తేజ్‌ను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వేగంగా వెల్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద వార్తను సిఐ కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వివరించారు.