కూకట్‌పల్లి కోర్టులో నటి సమంతకు ఊరట
వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దన్న కోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటి సమంతకి కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన యూట్యూబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం సమంత పిటిషన్‌ను కోర్టు మరోసారి విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. సమంతకు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశించింది. అలాగే పోస్టు చేసిన వీడియోలకు సంబంధించి లింకులను సైతం యూట్యూబ్ చానెళ్లు తొలగించాలని.. రెండు యూట్యూబ్ చానెళ్లతో పాటు సీఎల్ వెంకట్రావ్‌ను కోర్టు ఆదేశించింది. ఆమె కూడా వ్యక్తిగత వివరాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని సమంతకి సూచించింది.
ఇటీవల అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన విడాకుల విషయంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారంటూ సమంత కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఆ రెండు యూట్యూబ్ ఛానళ్లు, సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియో లింక్స్‌ని తొలగించాలని ఆదేశాలు వెలువరించింది. వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.