సమంత స్పెషల్ సాంగ్

Cinema: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది. గత కొన్నిరోజులుగా సమంత స్పెషల్ సాంగ్ చేయబోతుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసినదే. పుష్ప చిత్రంలోని ఐదవ పాటలో సమంత అల్లు అర్జున్‌తో జత కట్టనుంది. సమంతకు ఇది తొలి ఐటెమ్ సాంగ్ అవుతుంది. ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది.
సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలు