sankranthi special: భీమ్లా నాయ‌క్‌ నుంచి పోస్ట‌ర్‌.. మ‌రికొన్ని సినిమాల అప్‌డేట్స్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సంక్రాంతికి ప‌ల్లెల్లో ఉండే హ‌డావుడి అంతాఇంతా కాదు.. గంగిరెద్దులాట‌లు, కోడిపందాలు, గుండాట, ఎడ్ల పందేలు, ముగ్గుల పోటీలు లాంటి ప‌లు స‌ర‌దాలు.. సంతోషాల‌తో ఉంటాయి. వీటితో పాటు ఈ సండుగ‌కు సినిమాల సంద‌డే ఎక్కువ‌గా ఉంటుంది. ఎంతలా అంటే సంక్రాంతిని సినిమాల‌ని వేరు చేసి చూడ‌లేం.. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతు ప‌లు సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్లు, పాట‌లు, వీడియోలను ఆయా చిత్ర నిర్మాణ సంస్థ‌లు విడుద‌ల చేశాయి. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఏ యే సినిమాలు అప్‌డేట్ ఇచ్చాయో ఓ లుక్కేద్దాం.

ప‌వ‌ర్ ఫుల్ భీమ్లా నాయ‌క్‌..

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బ‌ల్లాల‌దేవుడు రాణా ద‌గ్గుబాటి మ‌ల్టీస్టార్ చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం జ‌న‌వ‌రి 12నే విడుద‌ల కావాల్సి ఉండే.. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అభిమానుల్లో పండుగ జోష్ నింపేందుకు చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్‌, రాణా ఇద్ద‌రు ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, సంయుక్త మేన‌న్ క‌థాయ‌క‌లు, సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ వ‌చ్చేనెల 25న ప్రేక్ష‌కు ముందుకు రానుంది.


వ‌రుణ్ తేజ్ `గ‌నీ`

కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ణ్తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `గ‌ని`. ఈచిత్రాన్ని సిద్దు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌. తాజా ఈ చిత్రం నుంచి `కొడితే..` లిరిక్స్ విడియో సాంగ్ విడుద‌లైంది. తమ‌న్ సంగీతం అందించిన ఈ ప్ర‌త్యేక సాంగ్‌లో త‌మన్నా ఆడిపాడింది.


 


 


 


Leave A Reply

Your email address will not be published.