ఢిల్లీలో రేపటినుంచి పాఠశాలలు మూసివేత
వాయు కాలుష్యంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం

ఢిల్లీ(CLiC2NEWS) : ఢిల్లీలో శుక్రవారం నుండి విద్యాసంస్థలు మూసివేయనున్నారు. ‘మూడు, నాలుగు సంవత్సారాల వయస్సు పిల్లలు పాఠశాలలకు వెళ్తంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు’ అంటూ సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. మంత్రి గోపాల్ రాయ్ పాఠశాలలు రేపటి నుండి మూసి ఉంటాయని గురువారం వెల్లడించారు.
‘గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని మేం పాఠశాలలు తెరిచాం’. అయితే వాయు కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పాఠశాలలు శుక్రవారం నుండి మూసివేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి వెల్లడించారు.
Delhi: 24 గంటల్లోగా కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: సుప్రీం కోర్టు