విజయవాడ- శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతం
విజయవాడ (CLiC2NEWS): విజయవాడ నుండి శ్రీశైలం మధ్య రేపు ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డి హవిల్లాండ్ ఎయిర్క్రాప్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల ‘సీ ప్లేన్’ను పున్నమిఘాట్లో సిఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడ-శ్రీశైలం మధ్య ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, టూరిజం , ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ‘సీప్లేన్’ ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి చేరుకుని, అక్కడి జలాశయం నీటిలో ల్యాండయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు చేరుకుంది.