సీజనల్ ప్రూట్ నేరేడు

వర్షాకాలంలో దొరికే సీజనల్ ప్రూట్ నేరుడు పండు. ఏడాదిలో కనీసం ఒక్క సారైనా నేరేడు పండు తినాలంటారు పెద్దలు. ఎందుకంటే దీనివల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్నికావు. వీటిలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి ఎంతో సహకరిస్తుంది. అజీర్తి, అతిసారం సమస్యల నుండి బయటపడేస్తుంది. దీని రసం తాగడం వలన అజీర్తి దరిచేరదు. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపులో పేరుకుపోయిన మలినాలను సైతం తొలగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగు పరచడంలో నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది గర్భాశయ సమస్యలను తగ్గించడంలోనే ఉపయోగపడుతుంది.
కానీ అతిగా తింటే ఏదైనా ప్రమాదకారే.. నేరుడు ఏమీ మినహాయింపు కాదు. అతిగా తింటే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఈ నేరుడు పండును పరగడుపున తినకూడదు. అదేవిధంగా వీటిని తిన్న వెంటనే పాలు తాగకూడదు.