ముంబయిలో నేడు, రేపు 144 సెక్షన్

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ `ఒమిక్రాన్` కలకలం రేపుతోంది. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే మహారాష్ట్రలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు చర్యలుచేపట్టారు. మహమ్మారిని నిలువరించడానికి ముంబయిలో నేడు, రేపు 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ రెండు రోజుల పాటు నగరంలో ర్యాలీలు, బహిరంగసభలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ప్రజలు బయట తిరగడానిఇక వీళ్లేదని సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు వెగులు చూశాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ వైరస్ వ్యాప్తికి చర్యలు చేపట్టింది.