బెల్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో 5 సీనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పర్మినెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు బిఇ/ బిటెక్ (ఎలక్ట్రానిక్స్), ఎంఇ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) తో పాటు పని అనుభవం ఉండాలి . అభ్యర్థులు అక్టోబర్ 2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఒబిసిలకు మూడేళ్లు, ఎస్‌సి / ఎస్‌టిలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుం రూ. 600గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50వేల నుండి రూ. 1,60,000 వరకు ఉంటుంది. ఎంపిక రాతపరీక్ష , ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది.
దరఖాస్తులకు చివరితేది 24-10-2024. దరఖాస్తులను ది మేనేజర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , జూలహళ్లి పోస్ట్, బెంగళూరు చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలకు https://bel-india.in. వెబ్‌సైట్ చూడగలరు.