19 నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల జూలై 19 వ తేదీ నుంచి నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలన్నారు. కరోనా.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే కేంద్ర సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో రావాలన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా మంత్రివర్గ సభ్యులను ప్రధాని కోరారు.