ఘ‌నంగా డైరెక్ట‌ర్‌ శంక‌ర్ కూతురి వివాహం

తమిళనాడులోని మహాబలిపురంలో అగ్ర‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న కూతురు ఐశ్వ‌ర్య‌ని క్రికెట‌ర్ రోహిత్‌ దామోదరన్‌కి ఇచ్చి ఆదివారం ఘ‌నంగా వివాహం జ‌రిపించారు. ఈ వివాహ వేడుక‌కు త‌మిళ‌నాడు సిఎం ఎంకే స్టాలిన్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై నూత‌న వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి కొడుకు రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్‌ చెన్నైలో పారిశ్రామికవేత్త. అలాగే ఆయ‌న మధురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కు యజమాని కూడా.
డైరెక్ట‌ర్ శంకర్‌ కుమార్తె ఐశ్వర్య వైద్యురాలు. ఇప్పుడు శంక‌ర్ భార‌తీయుడు- 2 సినిమాతో పాటు రామ్ చ‌ర‌ణ్‌, ర‌ణ్‌వీర్ సింగ్ మూవీల‌తో బిజీగా ఉన్నాడు.

Leave A Reply

Your email address will not be published.