ముగ్గురు బాలీవుడ్ నటులకు కేంద్రం షోకాజ్ నోటీసులు..

లఖ్‌నవూ (CLiC2NEWS): ముగ్గరు బాలీవుడ్ అగ్ర నేతలకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనందుకు గాను గతంలో ఓ న్యాయవాది అలహాబాద్ హైకోర్టులో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, య్‌దేవ్‌గణ్ పై పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురికి నోటీసులు అందినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనానికి తెలియజేశారు. అగ్ర నటులు హానికారక ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలైంది. భారత ప్రభుత్వం నుండి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటన్లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషన్‌పై విచారన జరిపిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. మరోసారి పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కేంద్రాన్ని స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 22వ తేదీనే ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు సమాచారం అందించారు.