Singareni: నేటి నుంచి సింగరేణిలో వ్యాక్సినేషన్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): సింగరేణి సంస్థ నేటి (ఆదివారం) నుంచి  క‌రోనా వ్యాక్సినేష‌న్ మెగా టీకా డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సిఎండి శ్రీధర్ తెలిపారు. 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు వాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 29 వేల మందికి పది రోజుల్లోగా టీకాలు వేసే ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.కార్మికులకు వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో ఉండేలా సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాల్స్‌లో వాక్సినేషన్ కేంద్రాలను మార్చినట్లు చెప్పారు. కార్మికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిఎండి కోరారు.

Leave A Reply

Your email address will not be published.