స్నేహితుల ఉదారత.. ఎస్సై కుటుంబానికి రూ.45.68 లక్షలు

అమలాపురం (CLiC2NEWS): డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఎస్సై కుటుంబానికి తోటి మిత్రులు రూ.45.68 లక్షలు ఆర్ధిక సాయం అందించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె. గంగవరానికి చెందిన ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసు స్టేషన్‌లో తుపాకి పేలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సత్యనారాయణ మూర్తికి భార్య, ఇద్దరు (3 ఏళ్ల చిన్నారి, 16 నెలల పాప) చిన్నారులు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి సత్యనారాయణ మూర్తి బ్యాచ్ పోలీసులంతా కలిసి రూ. 45.68 లక్షలు అందించారు.