ఏడిద సీతానగరం అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ తోట

మండపేట (CLiC2NEWS): మండలంలో అభివృద్ధికి నోచుకోలేని ఏడిద సీతానగరం గ్రామాభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. శనివారం తన నివాసంలో ఏడిద సీతానగరం గ్రామ సర్పంచ్ వరదా చక్రవర్తి ఆధ్వర్యంలో తరలివచ్చిన వైయస్సార్సీపి కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను గతంలో సీతానగరం పర్యటించినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తానని వాగ్దానం చేశానని, అదేవిధంగా పంట కాలువ పై కల్వర్టు నిర్మాణానికి కూడా వాగ్దానం చేశానని వాటిని వెంటనే పనులు పూర్తి చేయించామని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనం రూ 75 లక్షలతో నిర్మిస్తునట్లు ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన స్థలాన్ని సేకరించమని సర్పంచ్ వరదా చక్రవర్తిని ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు కేటాయించడం జరుగుతుంది అన్నారు. గ్రామాభివృద్ధికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు మరింతగా కృషి చేయాలని ఆయన కోరారు.
ఆవు దూడ వెండి మెమెంటోతో సత్కరించిన సర్పంచ్ వరదా చక్రవర్తి..
శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులకు ఆవు దూడ వెండి విగ్రహాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సర్పంచ్ వరదా చక్రవర్తి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కాంక్షించే తోట త్రిమూర్తులుకు పశువులపై, పశు సంరక్షణపై అమితమైన శ్రద్ధ ఉందన్నారు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఆవు దూడ విగ్రహాలను ఆయనకు బహుకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ కన్వీనర్ టీవీ గోవిందరావు, రావూరి చిన్న కాపు, కసిరెడ్డి శ్రీనివాస్, బోలా సూర్యనారాయణ, బోలా వీరబాబు, కొప్పిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.