AP: లారీ, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం

చింతూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదం లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఛత్తీస్‌గఢ్ నుండి భద్రాద్రి శ్రీరామచంద్రస్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు కలిసి ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.