తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 65,263 మందకి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,484 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు నాలుగు వేలకుపైనే నమోదవుతున్న విషయం తెలిసినదే. కరానాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు 7,18చ241 మంది కరోనా బారినపడినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 38,723 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా జిహెచ్ ఎంసి పరిధిలో తాజాగా 1,045 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యింది.