సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..

సికిందరాబాద్ (CLiC2NEWS): సికిందరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ వద్ద దట్టమైన పొగలు వ్యాపించాయి.ఇది గమనించిన లోకో పైలట్ రైలును బీబీ నగర్ రైల్వే స్టేషనల్లో రైలును నిలిపి వేశారు. రైలు ఇంజిన్ బ్రేక్ లైనర్లు గట్టిగా పట్టేయడంతో పొగలు వ్యాపించినట్లు స్టేషన్‌లో ఉన్న రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేశారు. దాంతో ట్రైన్ 20 నిమిషాల అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.