ఆదిలాబాద్ లోని ఐటిఐ కళాశాలలో సాయిల్ టెస్టింగ్ కోర్సులు

ఆదిలాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ఐటిఐ కళాశాలలో భూసార పరీక్ష (సాయిల్ టెస్టింగ్) అనే మరో కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాలలో గురువారం జరిగిన ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ కమిటీ (ఐ.ఎం.సి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సుజాత, ఇండస్ట్రియల్ ఏడి మధు చారి సభ్యులు రొడ్డ, శ్రీనివాస్, ప్రశాంత్, గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కళాశాలలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఐటిఐ కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలలో భూసార పరీక్షలు అనే మరో కొత్త కోర్సు అందుబాటులోకి వచ్చిందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త కోర్సు కోసం భవన నిర్మాణంతో పాటు పరికరాల ఏర్పాటు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు కళాశాలలో విద్యార్థుల ప్రధాన సమస్య అయిన మధ్యాహ్న భోజనం పథకంపై త్వరలో జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.