శీతకాలంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి..?
శరీర పోషణ గురించి కొన్ని ప్రకృతి చికిత్స చిట్కాలు:
శీతాకాలం వస్తుంది అంటే చాలామందికి సంతోషంగా ఉంటుంది, కొంతమందికి బాధగా ఉంటుంది ( ఆస్తమా సైనస్ వారికి) ఏది ఏమైనా శీతాకాలం పగలు తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉంటుంది గనుక, శరీరానికి చక్కని నిద్ర దొరుకుతుంది చక్కని ఆరోగ్యంతో ఉంటాము.,శీతాకాలంలో వచ్చేటటువంటి జబ్బుల నుండి రక్షించుకోవడానికి, చక్కని వ్యాయామాము, యోగ, ప్రాణయామము, రన్నింగ్, వాకింగ్,స్కిప్పింగ్, డాన్స్,ఏరోబిక్, 45 నిమిషాలు మరియు ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతి,సంప్రదాయాలతో, భజనలు, నమాజు, ప్రేయర్ తో శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.మరియు చలికాలంలో శరీరానికి పోషణ ఇచ్చేటటువంటివి ఆహార పదార్థాలు, మరియు కాలాన్ని బట్టి వచ్చే ఆకుకూరలు, కూరగాయలు,ఫలాలు మరియు,చక్కని న్యూట్రిషన్ ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరిగి, చలికాలం వచ్చే జబ్బులు, జలుబు పడిశము తుమ్ములు జ్వరము, కూడా రాకుండా వైరల్ ఫీవర్ రాకుండా ఉంటాయి.
చలికాలంలో చలికాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చలి కోట్( స్వెటర్స్) ధరించవలెను, చెవులకి మఫ్లర్ కట్టుకోగలను, అత్యవసరమైన పరిస్థితుల్లో చలికి బయటికి వెళ్లినప్పుడు చేతులకి గ్లౌజ్ తొడగకవలెను అప్పుడే చలి నుండి శరీరానికి రక్షణ కలిగిస్తుంది, శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. శరీరానికి రుతువుకు అనుకూలంగా ఉష్ణోగ్రతను మార్చుకునే శక్తి ఉండాలి, అప్పుడే చలి తగ్గుతుంది. చలికాలం తీసుకునే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా వహిస్తే శరీరం సంతులితంగా ఉంటుంది. చలి తక్కువగా ఉంటుంది.
చలి నుంచి రక్షించుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు.
1. చలికాలంలో శరీరాన్ని వేచ్చగా ఉంచడానికి కొన్ని కషాయాలు తాగవలెను.
2. మూడు తులసి ఆకులు, మూడు మిరియాలు ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాసు వరకు మరిగించి దాన్ని వడపోసి దానిలో ఒకటి చెంచా తేనె కలిపి తాగవలెను.
2. ఉదయం పరిగడుపున తిప్పతీగ కషాయము తాగిన ఆరోగ్యానికి మంచిది. ఇది రోగ నిరోధక శక్తి పెంచుతుంది చలికాలం వచ్చేటటువంటి రుగ్మతలను తగ్గిస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు బ్యాక్టీరియా నుంచి వచ్చే జబ్బుల్ని నివారిస్తుంది.
3. చలికాలంలో పెదవులు ఎక్కువగా పగులుతూ ఉంటాయి, దానికి రాత్రి పడుకునే ముందు పెదవులకి కొబ్బరినూనె లేదా ఆవు నెయ్యి చక్కగా దాని మీద రాసి పడుకోవలెను.
4. చలికాలంలో పాదాల పగుళ్లు వచ్చినట్లయితే కుంకుడుకాయ రసంతో కొబ్బరి పీచుతో చక్కగా వాటిని కడిగి రాత్రి పడుకునే ముందు దాని మీద పగుళ్ళకి కొబ్బరి నూనె రాసినట్లయితే కొన్ని రోజుల్లో పగుళ్లు తగ్గిపోతాయి.
5. శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముసలి, తిప్పతీగ ఇంకా చాలా రకాలు తీసుకున్నట్లయితే శరీరం వెచ్చగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతూ రోగాలు రాకుండా ఉంటాయి
6. పిల్లలకు జలుబు తుమ్ములు పడిసం, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు ఆస్తమా సైనస్,ఉన్నవాళ్లు చవన్ ప్రాష్ పాలల్లో తీసుకుంటే చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు,
7. శీతాకాలంలో మనం స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారుతుంది. దానికి అలోవెరా జెల్, లేదా రాత్రి పడుకునేటప్పుడు నువ్వుల నూనె, లేదా స్నానానికి ముందు బాదం నూనె లేదా నువ్వుల నూనె మసాజ్ చేసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయవలెను.
8. చలికాలంలో శరీరానికి ఆవనూనె మాలిష్ చేస్తే చక్కగా ఉంటుంది.
9. చిన్నపిల్లలకు చలికాలం శరీరం సుకుమారంగా ఉంటుంది చలిగాలుల బారి నుండి కాపాడుకోవడానికి ఆయుర్వేద ఉత్పత్తులు కొన్ని డాక్టర్ సలహా మేరకు వాడితే పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు.
10. చలికాలంలో వాతం ఎక్కువై శరీరమంతా నొప్పులు రావటానికి అవకాశం ఉంది, దానికి గాను నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనే తో ప్రతిరోజు మాలిష్ చేసి చక్కగా గోరువెచ్చని నీటితో స్నానం చేయవలెను.
11. చలికాలంలోని తలలో చుండ్రు అధికంగా పెరుగుతుంది, దానికి నేచురల్ గా కుంకుడుకాయ, శికా కాయ, ఉసిరికాయ మూడు సమభాగాలు కలిపి ఒక గాజు సీసాలో ఉంచుకోగలను, తలస్నానానికి ఒక 20 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక రెండు టీ చెంచాలు పౌడర్ని నానబెట్టి దానిని షాంపూ గా తలకు వాడవలెను. చుండ్రు తగ్గి, వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి చక్కగా వెంట్రుకలు బాగా పెరగడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు తలకు కొబ్బరినూనె రాయవలెను. చెట్టు వ్రేళ్ళకి నీళ్లు పోస్తే, చెట్టు పైన ఆకులు పచ్చగా ఉంటాయి అదే విధంగా వెంట్రుకల కుదుళ్లకు మనము కొబ్బరి నూనె రాసినట్లయితే వెంట్రుకలు కుదురు దృఢం అవుతాయి మరియు వెంట్రుకలు చక్కగా ఏపుగా పెరగటం జరుగుతుంది. తలకు నూనె రాయకపోవటం వల్ల డ్రై గా మారిపోయి చుండ్రు రావడం మరియు తల వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుంది.
12. చలికాలంలో ముఖము సౌందర్యంగా ఉంచుకోవటానికి అలోవెరా జెల్, ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్, కుంకుమాది తైలము, చందన పౌడరు ముఖానికి వాడవలెను.
13. చలికాలంలో వేరుశనగ, నువ్వులు ఉండలు, బాదం, బెల్లము, అల్లము, వెల్లుల్లి ఇలాంటివి చక్కగా మొదలవున్నవి ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
చలికాలంలో ఆరోగ్యాన్ని మేలు చేసే ప్రకృతి నియమాలు మరియు ఆహార పదార్థాలు .
1. ఉదయం లేవగానే కాలా కృత్యములు చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీట్లోని ఒక టీ స్పూన్ తేనే, ఒకటి spoon నిమ్మరసం కలిపి తాగవలెను.
లేదా
ఒకటి స్పూన్ నిమ్మరసం,ఒకటి స్పూన్ అల్లం రసం, తగిన బెల్లం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగవలెను.
2. ప్రతిరోజు అల్లం తీసుకుంటే చిన్న పెద్ద రుగ్మతల బారి నుండి రక్షించుకోవచ్చును. చలికాలంలో దీన్ని ఏదో ఒక రూపంలోని తీసుకుంటే ఇది శరీరానికి వేడినిస్తుంది. డైజెషన్ మెరుగుపరుస్తుంది.
3. రాత్రి నానబెట్టిన బాదం, అంజీర, ఎండు ఖర్జూర కూడా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బాదం లో ఎన్నో ఉపయోగకరమైన తత్వాలున్నాయి దీన్ని నియమబద్ధంగా సేవిస్తే అనేక రోగాల నుంచి రక్షించుకోవచ్చు. బాదం తింటే జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. ఇది డ్రైఫ్రూట్ మరెన్నో రోగాల వారి నుండి రక్షణ కూడా కల్పిస్తుంది. దీనిని ప్రతిరోజు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. బాదం లో డయాబెటిస్ ని నియంత్రించే తత్వం ఉంది ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.
4. కొన్ని రకాల ధాన్యాలు శరీరానికి ఎక్కువగా వేడి కలిగిస్తాయి దానిలో జొన్నలు అలాంటి పదార్థమే. చలికాలం జొన్న రొట్టె చేసుకుని తినాలి చిన్న పిల్లలకు కూడా జొన్న రొట్టె ఇవ్వాలి, ఇందులో ఆరోగ్యపరమైన గుణాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో జొన్న రొట్టెలు తయారు చేసుకుని చక్కగా చలికాలం తింటారు. జొన్నలల్లో మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి, యాంటి ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.
5. చలికాలంలో తేనె తీసుకోవడం వల్ల రక్తం శుభ్రం అవుతుంది.మరియు శరీరంలోని తేనె వేడిని పుట్టిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంటుంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా చక్కగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ ని కూడా చక్కగా పెంచుతుంది.
6. చలికాలంలో వేరుశనగలు తింటే దానిలోని ప్రోటీన్స్, తేమ మరి మినరల్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్లు కాల్షియం ఫాస్పరస్ ఐరన్ కెరటనిన్, ధయామిన్,ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇందులో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ శరీరానికి చాలా ఉపయోగకరమైనవి.దీనిని తప్పకుండా శీతాకాలం ఉపయోగించాలి.
7. శీతాకాలంలో నువ్వులు తీసుకుంటే శరీరం శక్తి లభిస్తుంది. నువ్వుల నూనే మాలిష్ చేస్తే శీతాకాలంలో శరీరాన్ని రక్షించుకోవచ్చును. నువ్వులు పట్టిక బెల్లము కషాయం తయారు చేసుకొని దగ్గు వచ్చినప్పుడు తాగితే కఫం బయటికి నెట్ట వేయబడుతుంది. నువ్వుల్లో ఎన్నో పోషక తత్వాలు ఉన్నాయి ప్రోటీన్, కాల్షియం, బి కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్లు, మొదలగున్నవి.ప్రాచీన కాలంలో సౌందర్య పోషణ కోసం నువ్వుల్ని ఉపయోగించేవారు.
8. మనం తీసుకునే భోజనంలో ఆకుకూరలు తప్పకుండా ఉండేలాగా చూసుకోవాలి. కాయగూరలు శరీరానికి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి, ఉష్ణాన్ని ఇస్తాయి. చలికాలంలో మెంతులు, క్యారెట్,బీట్రూట్, పాలకూర మొదలుకొని తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్టం పెంచుతుంది.
చలికాలంలో ఉదయం చక్కగా యోగాసనాలు చేస్తే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది
1. సూర్య నమస్కారాలు 12 సార్లు చేయవలెను.
2. ప్రాణాయామములో అనులోమ విలోమము 30 సార్లు చేయవలెను.
3. కపాలభాతి 300 సార్లు చేయవలెను
4. శరీరాన్ని వేడి గా ఉంచేందుకు, భుజంగాసనము, ధనురాసనము, శలభాసనము, చక్రాసనము వెయ్యవలెను దగ్గరగా ఉన్న యోగా గురువు సమక్షంలోని యోగ శిక్షణను నేర్చుకొని ఆరోగ్యవంతంగా ఉండగలరు.
-షేక్ బహర్ అలీ
ఆయుర్వేద వైద్యులు
[…] శీతకాలంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా… […]