‘సన్ ఆఫ్ ఇండియా’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటుడు మోహన్‌బాబు నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్ విడుదలైంది. ఈనెల 18వ తేదీన ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘ప్రపంచంలోని ఏ పోరాటమైనా ఒకడితోనే ప్రారంభమవుతుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమయి పవర్‌పుల్‌గా సాగుతుంది.
డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. శ్రీకాంత్, అలీ, తనికళ్ల భరణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం అందించారు.