మంత్రి కెటిఆర్‌ను క‌లిసిన సోనూసూద్

హైద‌రాబాద్ (CLiC2NEWS): వెండితెర‌పై విల‌న్ క్యారెక్ట‌ర్లు పోషిస్తూ నిజ జీవితంలో రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనుసూద్ మంగ‌ళ‌వారం మంత్రి కెటిఆర్‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ప్రగతిభవన్‌లో జ‌రిగిన ఈ భేటీలో సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కెటిఆర్ అభినందించారు.

ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, సేవారంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రితో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు. సమావేశానంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్‌కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం సోనూసూద్‌ను శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.