ఎపిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు సాయం అందిస్తా: సోనూసూద్

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తానని సోనూసూద్ తెలిపారు. కొత్త ప్రభుత్వం అమలులోకి వచ్చిన తొలి 100 రోజుల్లో సిఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఎపి ప్రజలు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. సుదీర్థ పాలనానుభవం ఉన్న సిబిఎన్ (చంద్రబాబు) సర్.. తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని సిఎంను, ప్రభుత్వ పాలనను కొనియాడారు. త్వరలోనే ఆయనను కలవనున్నట్లు వెల్లడించారు.