ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ దంప‌తుల వినాయ‌క చ‌వితి ప్ర‌త్యేక పూజ‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. భారీ మ‌ట్టి వినాయ‌కుడిని ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ప్ర‌తిష్టించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, శోభ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశుడిని ఈ సంద‌ర్భంగా సిఎం వేడుకున్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కెటిఆర్ – శైలిమ దంప‌తులు, ఎంపీ సంతోష్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.