కాళేశ్వరం జోన్ పరిధి పోలీసులకు క్రీడా పోటీలు

 గోదావరిఖని  (CLiC2NEWS): రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో కూడా రాణించి మంచిపేరు తీసుకురావాలని రామగుండం అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో కాళేశ్వరం జోన్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ఆదివారం ఆయ‌న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్
పోటీలు కోసం క్రీడాకారుల ఎంపిక కోసం క్రీడ‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ పోటీలు రామగుండం పోలీస్ కమిషనరేట్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ టీమ్స్ మధ్య షటిల్ బ్యాట్మెంటన్, వాలీబాల్,కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్, తగ్గాఫర్, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు లలో సెలక్షన్ లు జరుగుతాయి.

పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం విధినిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని డిసిపి అన్నారు. సిబ్బందికి ఎల్లప్పుడు పని ఒత్తిడి తట్టుకోవడానికి, శక్తిని ఇవ్వడానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కాలేశ్వరం జోన్ తరుపున రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొని, కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని డిసిపి కోరారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ఏ ఆర్ ఏసీపీ లు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, మల్లేశం, సంపత్, ములుగు ఆర్ఐ సంతోష్ కుమార్, తదితరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.