IND vs WI: వెస్టిండీస్ ముందు 266 పరుగుల లక్ష్యం ..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌటైంది. విండీస్ ముందు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (80),రిషబ్ పంత్ (56) అర్ధ శతకాలతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు, అల్జారీ జోసెఫ్, హేడెన్ వాల్ష్ రెండేసి.. ఓడీన్ స్మిత్, షేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నాలగో ఓవర్ మూడో బంతిలో రోహిత్ శర్మ (13) బౌల్డ్‌కాగా.. ఐదవ బాల్‌కి విరాట్ కోహ్లి షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ (10) పదవ ఓవర్లో ఔటయ్యాడు. భారత్ 42 పరుగులవే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (80), రిషబ్ పంత్ (56) రాణించారు. దీపక్ చాహర్ (38), సుందర్ (33) సూర్యకుమార్ యాదవ్ (6), కుల్దీప్ యాదవ్ (5). సిరాజ్ (4) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు.