SRH vs LSG: ఒక్క వికెట్ కోల్పోకుండా సన్‌రైజర్స్ విజయం
![](https://clic2news.com/wp-content/uploads/2024/05/SRH-vs-LUCKNOW.jpg)
ఉప్పల్ (CLiC2NEWS) : ఉప్పల్ లో సన్‌రైజర్స్ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లఖ్ననవూ జట్టు 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 9.4 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 75, ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి జట్టు విజయానికి కారకులయ్యారు. ఉప్పల్ స్టేడియం ఫోర్లు, సిక్స్‌ర్లతో హోరెత్తించారు. హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు.. 8 సిక్స్‌లు తీశాడు. అభిషేక్ 28 బంతుల్లో 8 ఫోర్లు.. 6 సిక్స్‌లు తీసి అబ్బురపరిచారు.