44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకున్న సన్‌రైజర్స్

హైదరాబాద్ (CLiC2NEWS): ఐపిఎల్ 2025 సీజన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిన్స్ హెడ్ 67 పరుగులు, క్లాసెస్ 34, నితీశ్ కుమార్ 30, అభిషేక్ 24 పరుగులు సాధించారు.
287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 మాత్రమే చేసింది. ధ్రువ్ జురెల్ 70 పరుగులు చేయగా.. సంజు శాంసన్ 66 పరుగులు చేశారు.హెట్ మయర్ 42, శభమ్ దూబె 34* పరుగులు సాధించారు.
ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్‌లో ఇషాన్ కిషన్ 11 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదగా.. రాజస్థాన్ రాయల్స్‌లో ధ్రువ్ 5ఫోర్లు 6 సిక్స్‌లు బాదారు.