టిటిడి: ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు విడుదల
తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడది సెప్టెంటరు 25 నుంచి రద్దు చేశామని చైర్మన్ వివరించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అవి గ్రామీణా ప్రాంతంలోని సామాన్యులకు అందడం లేదనే భావనలో టిటిడి ఉందని తెలిపారు.
ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిఫుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్ విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు.