రేపటి నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

తిరుమ‌ల (CLiC2NEWS): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అక్టోబరు నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు టీటీడీ అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో ఉదయం 9గంటలకు అందుబాటులో ఉంచనున్నది. రోజుకి 8వేల చొప్పున టిక్కెట్లును విడుదల చేయనుంది.

రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ టోకెన్లను ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.