ఇంతటి విపత్తు ఎపుడూ రాలేదు.. చినజీయర్ స్వామి

విజయవాడ (CLiC2NEWS): వరద బాధితులను ఆదుకోవడంలో ఎపి ప్రభుత్వం అద్భత కృషి చేస్తోందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. విజయవాడ నగరంలోని భవానీపురంలో వరద బాధితులకు ఆయన ఆహారం పంపిణీ చేశారు. ఈసందర్బంగా నగరానికి ఇంతటి ప్రకృతి విపత్తు ఎపుడూ రాలేదని.. ప్రజలు నిర్మాణం చేసుకునే నివాసాలు నది, కాలువలు ప్రవహించే మార్గాలను అడ్డుగా ఉంటే ఇలాంటిదే జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే.. నీరు వెళ్లే మార్గాలను మూసివేసి నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు.