TS: ఇద్దరు పిల్లలతో స‌హా ఆత్మహత్య చేసుకున్న తల్లి

సూర్యాపేట (CLiC2NEWS): ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో.. నవ మాసాలు మోసి..క‌ని.. అల్లారు ముద్దుగా పెంచిన త‌న చేతులతోనే పిల్లలను ఉరితో కడతేర్చి తనూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘోర విషాదకర ఘ‌టన సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు..

న‌డిగూడెం గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనాధ్‌, మౌనిక భార్య భర్తలు. శ్రీనాధ్‌ ఆర్‌ఎంపీ డాక్ట‌రుగా పని చేస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాల నేపథ్యంలోనే మౌనిక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా పిల్లల‌తో స‌హా త‌ల్లి మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఈ ఘ‌ట‌నపై సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.