TS: 130 మంది ల‌బ్ధిదారుల‌కు సిఎం స‌హాయ‌నిధి చెక్కులు పంపిణీ చేసిన బాల్క సుమన్‌

మంచిర్యాల (CLiC2NEWS): పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్య‌మంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని 130 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణుకుంట్ల ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.