ఉప్పల్ వేదికగా చెన్నైపై సన్‌రైజర్స్ ఘనవిజయం..

ఉప్పల్ (CLiC2NEWS): హైదరాబాద్ సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చైన్నైపై ఘనవిజయం సాధించింది. ఇదే వేదికగా ముంబయిపై చరిత్ర సృష్టించన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ టీం మెరిసింది. శుక్రవారం హైదరాబాద్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. మార్‌క్రమ్ 50, అభిషేక్ 37 , ట్రావిస్ హెడ్ 31, పరుగులతో రాణించారు.