RRR: ఆర్ఆర్ఆర్ నుండి స‌ర్‌ప్రైజింగ్ వీడియో.. మాంచి కిక్కిచ్చిన జక్కన్న

హైదరాబాద్ (CLiC2NEWS): భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన పీరియాడిక‌ల్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్‌-చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు.
సోమవారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సినీ ప్రేమికులందరికీ ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటిస్తోన్న ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా ఓ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌’ పేరుతో 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.

రాజ‌మౌళి అత్య‌ద్భుతంగా స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించినట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచింద‌నే చెప్పాలి. వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది. రానున్న రోజుల‌లో మూవీకి సంబంధించి మ‌రింత జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు.జ‌న‌వ‌రి 7న సినిమాని థియేట‌ర్స్‌లోకి తీసుకురానున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌, హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు సినిమాలో కిల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.